బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ(ఓల్డ్ బ్యాచ్) మూడో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
ఏప్రిల్ 15 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
రెండో సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి 27 వరకు, మొదటి సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు జరుగుతాయన్నారు.
మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 25 అని వెల్లడించారు.
ఇతర వివరాల కోసం 040-23680241/254 ఫోన్ నంబర్లకు ఫోను చేయవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.