అమెజాన్ ఇండియా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను సగం ధరకే ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 18 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల వారికి వార్షిక ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ. 999కే అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. మెంబర్‌షిప్ తీసుకున్న వినియోగదారులకు రూ. 500 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రైమ్ డే సేల్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆఫర్ ప్రకటించింది. మెంబర్‌షిప్ తీసుకున్న కస్టమర్లకు జూలై 15 నుంచి 16 వరకు జరిగే ప్రైమ్ డే సే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. వెబ్‌సైట్ అమెజాన్. ఇన్ ద్వారా మెంబర్‌షిప్ తీసుకొవచ్చు.