ఓటుకు నోటు కేసులో నిందితులపై ఏసీబీ కోర్ట్ అభియోగాలు నమోదు చేసింది. ఈ రోజు జరిగిన విచారణలో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ లపై అనిశా కోర్టు అభియోగాలు నమోదు చేసింది.
నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 నమోదు చేసింది.
చేపట్టారు. ఐపీసీ 120 (బి) రెడ్ విత్ 34 అభియోగం నమోదైంది.
తమపై అభియోగాల్లో వాస్తవం లేదని రేవంత్, సెబాస్టియన్, ఉదయ్ సింహా తోసిపుచ్చారు. ఈ నెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.