ఆల‌య దాడులపై చిన‌జీయ‌ర్ స్వామి ఆగ్ర‌హం

261
Chinjiyar Swami angry temple attacks

ఏపీలోని దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడులపై త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి మండిపడ్డారు.

ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఆల‌యాలు మ‌న ధ‌ర్మానికి మూల కేంద్రాల‌ని చెప్పారు.

ఆల‌యాల‌పై దాడుల‌కు ప‌రాకాష్ఠ రామ‌తీర్థంలో రాముడి విగ్ర‌హ ధ్వంసం అని పేర్కొన్నారు.

దేవాల‌యాల‌పై ఆధార‌ప‌డే అన్ని క‌ళ‌లు జీవిస్తున్నాయ‌ని స్వామి వ్యాఖ్యానించారు.

క‌రోనా నుంచి విముక్తి క‌ల‌గాలని తాను శ్రీవారిని ప్రార్థించాన‌ని చెప్పారు.  తిరుప‌తి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిన్న చిన‌జీయ‌ర్  తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తాము నివేదిక అందించనున్నామని చిన‌జీయ‌ర్ పేర్కొన్నారు.