టీ అమ్ముతూ.. నెలకు 12 లక్షల ఆదాయం

267
tea-vendor-earns-12lakhs-month

నెలంతా కష్టపడితే ఓ సాధారణ ఉద్యోగి (ప్రైవేటు) సంపాదించే మొత్తం 10 వేల నుంచి 30 వేలు. అదే ఉద్యోగం వద్దు ఓ చిన్న వ్యాపారం పెట్టుకుంటే చాలు అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అలాగే మహారాష్ట్రకు చెందిన నవ్‌నాథ్ యెవ్లే అనే వ్యక్తి కూడా ఆలోచించాడు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. పుణెలో ‘యెవ్లే టీ స్టాల్’ పేరిట ఓ టీ స్టాల్ తెరిచాడు. ఇప్పుడు అతడు జేబు నిండా సంపాదిస్తున్నాడు. నెలకు అక్షరాలా రూ.12 లక్షల ఆదాయం గడిస్తున్నాడు.



అవును, నిజం! ఇప్పుడు నగరంలో ఆ టీ స్టాల్ చాలా ఫేమస్ మరి. అంతేకాదు.. జాతీయంగా ఉన్న తన బ్రాండ్‌ను ‘అంతర్జాతీయం’ చేస్తానని అంటున్నాడు. ‘‘ఒక్క పకోడి వ్యాపారమే కాదు.. ఈ టీ వ్యాపారం కూడా భారతీయులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ వ్యాపారం భారత్‌లో బాగా వృద్ధి చెందుతోంది. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని నవ్‌నాథ్ తెలిపాడు. ప్రస్తుతం నగరంలో యెవ్లే టీ స్టాళ్లు మూడున్నాయి. ఒక్కో స్టాల్‌లో 12 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.