కరువు కాలంలో రేట్లు భారీగా పెరుతున్నాయి. మొన్నటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
ఈ నెలలో వంట గ్యాస్ ధర మూడుసార్లు పెరిగింది. చమురు ధరలు పెరగడంతో భారత రైల్వే శాఖ కూడా లోకల్ ట్రైన్స్ ధరలు పెంచింది.
అనవసర ప్రయాణాలు ప్రయాణాలు తగ్గించేందుకు పెంచామని రైల్వే శాఖ చెబుతోంది. అన్‌లాక్ తర్వాత ఈ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు రైల్వే ఆధికారులు చెబుతున్నారు.
2020 మార్చి 25 నుంచి రెగ్యూలర్ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. అన్‌లాక్ తర్వాత స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు మొదలయ్యాయి.
ఛార్జీలు పెంచడంతో కొవిడ్-19 గురించి ప్రత్యేక నియమాలు మొదలుపెట్టి.. అదే దూరానికి మెయిల్/ఎక్స్‌ప్రెస్ ఛార్జీలను పెంచామని రైల్వే మినిస్ట్రీ చెప్పింది.
రోజూ వెళ్లే వాళ్ల కోసం ఈ లోకల్ ట్రైన్ మొదలుపెట్టినా ఛార్జీలు ఎక్కువ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదహరణకు అమృత్ సర్ నుంచి పఠాన్ కోట్ కు రూ.25గా ఉండే ఛార్జీ ఇప్పుడు రూ.55కు పెరిగింది.
తక్కువ దూరాలకు వెళ్లడం తగ్గించుకోవాలనే రైల్వేస్ ఛార్జీలను పెంచింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ 19ఇంకా తీవ్రంగానే ఉంది.
ప్రయాణికులు చాలా ప్రదేశాల నుంచి వస్తున్నారు. రైళ్లలో గుంపులుగా ఉండటాన్ని తగ్గించడం కోసం, కొవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఇలా చేసినట్లు మినిష్ట్రీ స్టేట్మెంట్ ద్వారా వెల్లడించింది.
ప్రస్తుతం రైల్వేస్ 65 శాతం మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపరేషన్ లోకి తీసుకొచ్చింది. మొత్తం 1250 మెయిల్/ఎక్స్ ప్రెస్, 5350 సబ్ అర్బన్ సర్వీసులు 326కు పైగా ప్యాసింజర్ ట్రైన్లు ఆపరేషన్లో ఉన్నాయి.
ట్రైన్లలో తక్కువ దూరాలకు ప్రయాణించే రైళ్లు 3శాతమే ఉన్నాయి. కొవిడ్-19 కారణంగా రెగ్యూలర్ ట్రైన్లను దేశవ్యాప్తంగా ఆపేశారు.
2020 మార్చి 22 తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తర్వాత సర్వీసులు పెంచింది.
ఇంకా పూర్తి స్థాయిలో రెగ్యూలేషన్ చేయాల్సి ఉంది. ప్రయాణికుడికి జరిగే ప్రతి నష్టాన్ని రైల్వేస్ భరిస్తుంది.