ఈసారి కూడా టెన్త్ పరీక్షలు రద్దు

233

త‌మిళ‌నాడు విద్యార్థుల‌కు మ‌రోసారి శుభ‌వార్త‌. ఈసారి కూడా టెన్త్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చే్స్తూ త‌మిళ‌నాడు ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

9, 10, 11వ తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

ఆ మూడు తరగతుల విద్యార్థులను త‌ర్వాత తర‌గ‌తుల‌కు ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

గతేడాది కూడా కరోనా కారణంగా తమిళనాడు ప్రభుత్వం పరీక్షలు లేకుండానే స్కూల్ విద్యార్థుల్ని పాస్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక శుభ‌వార్త చెప్పింది. రిటైర్మెంట్ వయసును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి పళని స్వామి అసెంబ్లీలో ప్రకటించారు.

సీఎం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న పళని ప‌లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.