ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు.
వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామ శివారులో బుధవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
గుత్తి వైపు నుంచి కడప వైపు వస్తున్న బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మృతులు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నోమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.