తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. రాజంపేట మండలం పొందురూ గ్రామంలో కత్తితో గొంతు కోసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే అప్సన బేగం (24) అనే యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. ప్రియుడు ప్రేమను నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై అప్సన బేగం బలవన్మరణానికి పాల్పడింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
యువతి మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.