ఏపీ కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు

361
Several key decisions in the AP cabinet

వెలగపూడి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అనేక ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి.

ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.

ఏఎంఆర్డీయేకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీకి కూడా మంత్రివర్గం  ఆమోదం తెలిపింది.

వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కూడా  సభ్యులు ఆమోదం తెలిపారు.

కాకినాడ సెజ్ భూముల నష్టపరిహారం ఖరారుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  నవరత్నాల అమలు క్యాలెండర్ కు కూడా ఈ కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.

కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.

కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కుకు, అంబాపురంలో 93.99 ఎకరాలతో మరో ఇండస్ట్రియల్ పార్కుకు ప్రతిపాదించారు.

ఈ రెండు పారిశ్రామిక పార్కులకు ఉచితంగా భూ కేటాయింపులు జరపాలన్న అంశాన్ని చర్చించారు.