ఫ్రీగా పెట్రోల్ కావాలా నాయ‌నా..

346

ఇంధ‌నం ధ‌ర‌లు ఆకాశానికి అంటుతున్న ఈ రోజుల్లో ఒక్క లీట‌ర్ పెట్రోల్ ఉచితంగా దొరికినా మ‌హా భాగ్యంగా భావిస్తాం.

కానీ అదే 50 లీట‌ర్లు ఉచితంగా ఇస్తామంటే.. గాల్లో తేలిన‌ట్టుందే అంటూ పాట‌పాడ‌తాం. ముట్టుకోకుండా దేశ‌వ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు మంట పుట్టిస్తున్నాయి.

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు నిత్యం పెరుగుతూ వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. భారీగా పెరిగి స‌రికొత్త రికార్డుకు చేరువ‌య్యాయి.

లీట‌రు పెట్రోలు కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ దాట‌గా.. మ‌రికొన్ని చేరువైంది. ఇలా నానా ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాహ‌న‌దారుల‌కు ఓ తీపి క‌బురు తీసుకొచ్చింది.

త‌మ క‌ష్ట‌మ‌ర్ల‌కు ఉచితంగానే పెట్రోల్ అందించే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్టు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు తెలిపింది.

అయితే ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ల‌కు మాత్ర‌మే ఈ ల‌బ్ది చేకూర‌నుంది. ఈ కార్డు ద్వారా పెట్రోల్, డీజిల్ పోయించుకున్న వాళ్ల‌కు రివార్డు పాయింట్లు వ‌స్తాయి.

వీటిని ఫ్యూయెల్ పాయింట్స్‌గా పిలుస్తారు. వీటిని రిడీమ్ చేసుకోవ‌డం ద్వారా ఏడాదికి 50 లీట‌ర్ల వ‌ర‌కు ఫ్రీగా పెట్రోల్‌ను పొంద‌వ‌చ్చ‌ని సంస్థ పేర్కొంది.

ఇండియ‌న్ ఆయిల్ ఔట్‌లెట్స్‌లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టిస్తే 5 శాతం ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు. తొలి ఆరు నెల‌ల‌కు గ‌రిష్టంగా 250 ఫ్యూయెల్ పాయింట్లు పొందొచ్చు.

త‌ర్వాత 150 ఫ్యూయెల్ పాయింట్లు ల‌భిస్తాయి. గ్రాస‌రీ, బిల్ పేమెంట్స్‌పై నెల‌కు 100 పాయింట్లు వ‌స్తాయి. ఇత‌ర‌త్రా వాటిపై రూ. 150 ఖ‌ర్చు చేస్తే ఒక ఫ్యూయెల్ పాయింట్ వ‌స్తుంద‌ని హెచ్‌డీఎఫ్‌సీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అంతేకాదు 1 శాతం ఫ్యూయెల్ సర్‌చార్జ్ మినహాయింపు ఉంది. ఫ్యూయెల్ పాయింట్లు రెండేళ్ల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లి మీరు ఈ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. రూ.500 జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే కార్డు వార్షిక ఫీజు రూ.500. ఏడాదికి రూ.50,000 ఖర్చు చేసే వాళ్లు ఈ ఫీజు చెల్లించాల్సిన అవ‌సరం లేదని వెల్లడించింది.