తెలంగాణలో శుక్రవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసాయి.
ఈ క్రమంలో పిడుగుపాటుకు యువ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఈ రోజు జరిగింది.
రాజోలి మండల కేంద్రానికి చెందిన కురవ ఈదన్నకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు వెంకటేశ్ (21) మధ్యాహ్నం యాసంగి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు.
పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. వెంకటేశ్ పనిచేస్తున్న సమీపంలోనే అకస్మాత్తుగా పిడుగు పడింది.
దీంతో వెంకటేశ్ అపస్మారక స్థితికి చేరాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.