ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై నుంచి అదుపు తప్పి ట్రాక్టర్ లోయలో బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు.
మరో 41 మందికి తీవ్ర గాయాలైనాయి. ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా పరిధిలోని ధిపాసాహి సమీపంలోజరిగింది.
ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన చేసి ట్రాక్టర్‌లో తిరిగి స్వగ్రామానికి బయలుదేరగా మార్గ మధ్యలో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.
స్థానికులతో కలిసి జార్పోఖ్రియా పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
క్షతగాత్రులను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని బరిపాదలోని పండిట్ రఘునాథ్ ముర్ము మెడికల్ కళాశాల, హాస్పిటల్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు.