మొబైల్ వినియోగ‌దార్ల నెత్తిన పిడుగు

227

మొబైల్ వినియోగ‌దార్ల నెత్తిన పిడుగు ప‌డ‌నుందా? అంటే అవున‌నే చెప్పాల్సివుంటుంది. ఎందుకంటే మ‌రికొద్ది రోజుల్లో ఇంట‌ర్నెట్‌, ఫోన్ కాల్స్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిల‌య‌న్స్ నుండి జియో రావ‌డంతో 2016లో టారీఫ్ భారీగా ప‌డిపోయింది. టెలికం కంపెనీల మ‌ధ్య పోటీ పెరిగి డేటా ధ‌ర‌లు, ఫోన్‌కాల్స్ ధ‌ర‌లు త‌గ్గాయి.

కానీ ప్ర‌స్తుతం ఆ కంపెనీలు త‌మ ఆదాయం ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ధ‌ర‌లు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా ప్ర‌తినిధులు చెబుతున్నారు.

అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి డేటా, కాల్స్ ధ‌ర‌లు పెరిగే అవ‌కాశ‌ముంది. ఇందుకోసం టెల్కోలు సిద్ధ‌మ‌య్యాయి.

ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సంస్థ (ఐసీఆర్ఎ) ప్ర‌కారం 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ధ‌ర‌లు పెరుగుతాయి.

ప్ర‌స్తుత‌మున్న 2జి క‌స్ట‌మ‌ర్ల‌ను 4జికి మార్చ‌డంతో పాటు ఇంట‌ర్నెట్‌, ఫోన్‌కాల్స్ ధ‌ర‌లు పెంచ‌డం ద్వారా ఏఆర్‌పీఎ పెంచుకోవాల‌ని కంపెనీలు భావిస్తున్న‌ట్టు ఐసిఆర్ ఎ అభిప్రాయ‌ప‌డింది.

దీంతో టెక్కోల ఆదాయం రాబోయే రెండేళ్ల‌లో భారీగా అంటే 11 శాతం నుంచి 13 శాతానికి పెరిగే అవ‌కాశ‌ముంది.

టెలికాం ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ఎటువంటి ప్ర‌భావం చూప‌క‌పోగా ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌, విద్యార్థుల‌కు ఆన్ లైన్ క్లాసుల ద్వారా ఇంట‌ర్నెట్‌, ఫోన్‌కాల్స్ వినియోగాన్ని పెంచింది.

టెలికం కంపెనీలు చివ‌రిసారిగా 2019 డిసెంబ‌ర్‌లో టారిఫ్ పెంచాయి.