కూతురుతో కలిసి చెరువులో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కామారెడ్డి జిల్లా భీక్కునూర్ మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకొంది.
మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన మహిళ 15 నెలల కూతురితో కలిసి గ్రామ శివారులో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
స్థానికుల సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
అనంతరం మృతుల వివరాలను వెల్లడించారు. మృతులు చాకలి పోశిలక్ష్మి(26), సాత్విక(15 నెలలు)గా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.