కేసీఆర్‌కు పలువురు నేత‌ల శుభాకాంక్ష‌లు

214
Many leaders wish KCR well

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ రోజు పలువురు నేత‌లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కేసీఆర్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

కేసీఆర్ ఎల్ల‌ప్పుడూ ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

టీడీపీ నేత‌ లోకేశ్ కూడా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ కేసీఆర్ ఎల్ల‌ప్పుడూ సంతోషంగా ఉండాల‌ని ట్వీట్ చేశారు.

కేసీఆర్‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు నితిన్ గ‌డ్క‌రీ, స‌దానంద గౌడ త‌దిత‌రులు కేసీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపూ ట్వీట్‌లు చేశారు.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి య‌డియూర‌ప్ప జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన వారికి కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.