ఏపీ‌లో మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల

200
AP municipal elections schedule releases

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఎన్నికల నగార మోగింది. మునిసిపల్‌ ఎన్నిక‌ల‌ను వ‌చ్చే నెల 10న నిర్వ‌హించ‌నున్నారు.

ఈ మేర‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది.గతంలో ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచే దీన్ని పున: ప్రారంభించాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 75 మునిసిపల్‌, నగర పంచాయతీలకు ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి.

వ‌చ్చేనెల‌ 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ‌కు గ‌డువు ఉంది.

గత ఏడాది మార్చి 23న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జ‌ర‌పాల‌ని ఏర్పాట్లు చేసుకోగా క‌రోనా విజృంభ‌ణ కార‌ణంగా వాయిదాప‌డ్డ విష‌యం తెలిసిందే.

అప్ప‌టికే 12 నగరపాలక సంస్థల్లో అభ్యర్థులు 6,563 మంది నామినేషన్లు దాఖ‌లు చేశారు.

అలాగే, 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు వేశారు. ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జ‌రుగుతున్నాయి.