వేదికపై కుప్పకూలిన గుజరాత్ సీఎం విజయ్ రూపాని

245
Gujarat CM collapses on stage

గుజరాత్ సీఎం విజయ్ రూపాని వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామ్ పురాలో జరిగిన సభలో ప్రసంగిస్తూ  పడిపోయారు.

ఈ ఘటనతో బీజేపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఆయనకు వేదికపైనే ప్రథమ చికిత్స చేసి, వెంటనే అహ్మదాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ఆయన గత రెండు రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్నారని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు.

అయినప్పటికీ ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలను రద్దు చేసుకోలేదని బీజేపీ నేత దంగే వ్యాఖ్యానించారు.

ఎన్నికల నేపథ్యంలో వరుస పర్యటనలతో బాగా అలసి పోవడం వల్లే ఆయన స్పృహ కోల్పోయారని అన్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యాధికారులు తెలిపారు.