బీజేపీ నేతలు సీఎంను దూషించ‌డం స‌రికాదు: బాల్క సుమన్

237
bjp-leaders-should-not-blame-cm

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ధ్వజమెత్తారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం చేతకాదన్నారు.

కానీ, సీఎం కేసీఆర్ పై మాత్రం నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు సీఎంను, మంత్రుల‌ను దూషించ‌డం స‌రికాదన్నారు.

ఎంపీ అరవింద్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం మానుకోవాలన్నారు. ఆయన  మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణకు నిధులు తీసుకురావడం చేతకాదు.. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు.

Also Read : బీజేపీ నేత‌ల‌కు త‌గిన స‌మ‌యంలో బుద్ధి చెబుతాం: కేటీఆర్

కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ర్టానికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఐటీఐఆర్ నిలిపివేశామని పార్లమెంటు సాక్షిగా ఓ కేంద్రమంత్రి ప్రక‌ట‌న చేస్తే ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదని అన్నారు.