నకిలీ నక్సల్స్ గుట్టు రట్టు.. రూ.5 లక్షల నగదు స్వాధీనం!

213
Fake Maoists Arrest 5 Lakhs recovery

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ నక్సల్స్ గుట్టును పోలీసులు రట్టు చేశారు.

జిల్లాలోని ఏడూర్ల బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టుల పేరుతో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఇసుక ర్యాంపుల నిర్వాహకులు, వ్యాపారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ విషయంపై నిఘా పెట్టిన పోలీసులు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ.5 లక్షల నగదుతో పాటు ఒక నాటు తుపాకి, మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఏడూర్ల బయ్యారం సీఐ రమేష్ తెలిపారు.

వీరంతా పోలీస్ స్టేషన్ పరిధిలోని జానంపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు.