జగన్ తో షర్మిల పోరాడుతున్నారు: చంద్రబాబు

141
Sharmila is fighting with Jagan:Chandrababu

తెలంగాణలో వైయస్ షర్మిల రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఆమె పార్టీని ప్రారంభించనున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తో ఈరోజు షర్మిల,వివేకా కూతురు పోరాడుతున్నారని అన్నారు.

రాజకీయ పార్టీని పెడుతున్నాని వైయస్ షర్మిల చెప్పినప్పటికీ విజయసాయిరెడ్డి మాత్రం అదేమీ లేదంటున్నారని ఎద్దేవా చేశారు.

జగనన్న విశ్వసనీయత ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. షర్మిల పార్టీ పెట్టడంపై జగన్ స్పందించాలని అన్నారు.

ఇంట్లో వాళ్లకి కూడా జగన్ వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా తేలనే లేదని అన్నారు.

ఎన్ని దుర్మార్గాలకు, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని అన్నారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 38.74 శాతం ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చాయన్నారు.