మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం కౌంటర్!

152
Ap sec

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఎస్ఈసీ మాట వినే అధికారులపై చర్యలు తప్పవని పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులపై ఎస్ఈసీ అనుమతి లేకుండా ఎవరూ చర్యలు తీసుకోలేరని స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలంటే ఎస్‌ఈసీ అనుమతి తప్పనిసరని తెలిపింది.

ఎన్నికల వేళ దౌర్జన్యపూరిత చర్యలకు పాల్పడేవాళ్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. బెదిరింపు ప్రకటనలు చేస్తున్నది ఎంత పెద్దవాళ్లయినా లక్ష్యపెట్టాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఉద్యోగులకు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలా నిలుస్తుందని ఎస్ఈసీ
నిమ్మగడ్డ ఉద్యోగ సంఘాల నేతలతో పేర్కొన్నారు. ఎస్ఈసీని ఉద్యోగ సంఘాలు కలిసిన నేపథ్యంలో ఎస్ఈసీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.