మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
ఈ రోజు జగిత్యాల జిల్లా వెల్గటూరు ఎంపీడీఓ కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టాయని మంత్రి చెప్పారు.
నిరుపేద ఆడపడుచులకు ఈ పథకాలు అంతో దోహదపడుతున్నాయన్నారు. కళ్యాణలక్ష్మి పథకంతో పెద్దింటి ఆడబిడ్డల పెళ్లికి రూ.100,116 ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు.
మహిళ సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ప్రభుత్వ కార్యక్రమాలు ఉపయోగించుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.