భారత్ లో తగ్గిన పాజిటివ్‌ కేసులు!

200
Covid-19 possitive cases India Icmr

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి భారత్ లో తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మంగళవారం భారీగా తగ్గాయి. గతేడాది జూన్‌ నెల  తర్వాత తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,66,245కు పెరిగింది. తాజాగా 13,423 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,48,406 మంది కోలుకున్నారని ఆ శాఖ పేర్కొంది. మరో 94 మంది వైరస్‌ ప్రభావంతో మరణించగా.. మృతుల సంఖ్య 1,54,486కు పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,63,353 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 39,50,156 మందికి టీకాలు వేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం దేశవ్యాప్తంగా 6,59,422 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది.