తండ్రి మరణానికి తల్లే రావద్దంది

329
siraj did not attend father dies

నాన్న ….. జీవితమనే సాగరం లో నిప్పుకణలాంటి ధైర్యం
పిల్లల కలల్ని సాకారం చేయాలనుకునే మొట్టమొదటి ఆకాంక్షుడు ..నాన్న
తన పిల్లలు ఏదైనా సాదించినపుడు ఆనందభాష్పలతో కళ్ళు నిమురుకునేది …నాన్న

మనకోసం రేయింపవళ్ళు పరితపించి మనల్ని ఉన్నత స్థాయికి చేర్పించి తాను మాత్రం భాద్యత తీరిపోయిందంటూ ఈ లోకానికి స్వస్తి చెబుతూ వెళ్ళిపోతాడు ఈ దీనగాథ ఎవరిదో తెలుసా…

“మహమ్మద్ సిరాజ్” హైదరాబాద్ ఫెసర్ తన జీవితంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు ఎంపికైన మన హైదరాబాదీ తెలంగాణ ముద్దుబిడ్డ కంగారు గడ్డ ఫై తన సత్తా చాటాలని తండ్రి కలను సాకారం చేయాలనీ ఉత్సుకతతో అడుగు పెట్టిన క్షణమే ఆ తండ్రి ఇక లేరనే వార్త చెవిలో పడగానే ఇక నా పరుగు ఎవరికోసం సలసల కాగే తన రక్తం సచ్చుబడి పోయింది. నిరాశ నిస్పృహ గుండె నిండా ఆవరించింది. తండ్రి కర్మ కాండలకు హాజరై చివరి సారైనా ముఖం చూసుకుందామని తిరిగి ఇండియాకి బయలుదేరాలనుకున్నాడు.

ఆ క్షణం తన తల్లి “షబానా బేగం” చెప్పిన మాటలు తన ఫై మంత్రం లా పనిచేసాయి. సల్ల బడిన తన రక్తం ఉడుకు రక్తం లా మారిపోయింది. కారుతున్న కన్నీళ్లు ఆగిపోయాయి. నిరాశ నిస్పృహ వదిలి తిరిగి ఆటపై శ్రద్ద పెట్టేలాచేసింది.

జరిగిందేదో జరిగిపోయింది నిన్ను ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసిన మీ నాన్న ఇకలేరు. నువ్వు దిగులు చెంది దేశ ఔనత్యాన్ని దిగజార్చకు. మీ నాన్నకలగన్న ఆ కీర్తి ప్రతిష్టలు నూటఇరవై కోట్ల భారతీయులు నీ మీద పెట్టుకున్న ఆశలు మర్చిపోకు. నీ భాద్యత భక్తి శ్రద్దలతో త్వరితగమనాన నెరవేర్చు జరగాల్సింది చూడు. మీ నాన్న నీతోనే ఉన్నాడు నీ ఆట చూస్తున్నాడు ధైర్యం తెచ్చుకో.  నీ సత్తా ఏంటో చూపించు. తిరిగి విజయంతోనే భారత గడ్డఫై కాలుపెట్టు అని సంబోధించిన తల్లికి ఆ కొడుకు ఏమని ప్రార్థించాలి ఈలాంటి తల్లి దండ్రులున్న పిల్లలు జీవితం లో ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు దేశ ప్రతిష్టను తల్లి దండ్రుల కలలను నెరవేరుస్తారు.

ఆ తల్లి షబానా బేగం కి నేడు భారతావని శిరస్సువంచి నమస్కరిస్తుంది. జయహో భరత్