అన్ని సమస్యలు ప్యూరిఫైడ్ వాటర్ తోనే

272
many problems with purified water

నేడు గ్రామాలలో సైతం భూగర్భజలాలు అడుగంటిపోతున్న విషయం అందరికి తెలిసిందే, అందులబోను మంచినీటి బోర్లలలో సైతం ఉప్పునీరే వస్తుంది. వాటిని నేరుగా త్రాగలేని పరిస్థితి.

ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ప్యూరిఫైడ్ వాటర్ నేడు గ్రామానికి సోకింది. ఆ నీళ్ళు తప్పితే గొంతారని పరిస్థితి నెలకొన్నదంటే అతిశయోక్తిలేదు. కానీ అసలు సమస్య అక్కడే వచ్చిపడింది. ప్రతిగ్రామంలో ఒకటికి మించి ప్యూరిఫైడ్ సెంటర్ లను నిర్మించుకొని, త్రాగే నీళ్ళతో వ్యాపారం చేసుకుంటూ రోజుకు వేలలో సంపాదిస్తున్నారంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం అక్కర్లేదు. వ్యాపారం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు గానీ ఉప్పునీటిని మంచినీటిగా, ప్యూరిఫైడ్ గా మార్చే క్రమంలో అందులోవాడే రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో తెలిసి, తెలియకగా వాడుతూ నీటిని అమ్ముకోవడం, గత మూడు, నాలుగైదు సంవత్సరాల నుండి ఆ నీటిని వాడటంతో చిన్నపిల్లలను మొదలుకోని ముసలివారు దాకా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. శరీరంలో ఏదో సత్తువ కోల్పోయి, పట్టుకోల్పోయినట్లు బాధపడే పరిస్థితి నెలకొంది.

దీనికి తోడు మనం వాడే రసాయనిక ఆహారపదార్థాల కారణమో లేదా ఈ నీటి పుణ్యమో వీటివల్ల ప్రజలు వివిధ అనారోగ్యాల బారినపడి, హాస్పత్రుల వెంట తిరగాల్సిన పరిస్థితి నెలకొందంటే అందులో ఎలాంటి అవాస్తవం లేదు. ఇలాంటి నీటిని సేవించకుండా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తే, ఎలాంటి జాడ కనబడుట లేదు. ధనవంతులయితే వారు వ్యక్తిగతంగా వేలలో ఖర్చుబెట్టి ప్యూరిఫైడ్ వాటర్ పిల్టర్స్ ను కొనుగోలు చేసుకోని వాడుకుంటున్నారు. కానీ పేదవారి పరిస్థితుల గురించి ఆలోచించే నాధుడే కరువయ్యారు.

ఈ మహమ్మారీ పరిస్థితి నుండి పేదప్రజలను కాపాడటానికి ప్రభుత్వానికి చక్కటి అవకాశమున్నది. ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపట్టిన మహోత్తర కార్యక్రమం మిషన్ భగీరథ త్రాగునీటి సమస్యతో అష్టకష్టాలు పడుతున్న ప్రజానీకానికి, గొంతు తడపాలని గొప్ప ఆలోచనతో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా శుద్దిచేయబడిన మంచినీటిని సరఫరా చేయాలనే దృఢసంకల్పంతో శ్రీకారం చుట్టి, ఇప్పటికే 90 శాతం పనులు పూర్తిచేసి గ్రామాలకు నీరందించడానికి కృషిచేస్తున్నారు. కొన్నిచోట్ల ట్యాంక్ ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి.

avoid purified water

అందుకే వీలయినంత త్వరగా వీటన్నింటిని పూర్తిచేసి, శాస్త్ర, సాంకేతిక నిపుణులతో చర్చించి, ఎక్కడికక్కడ ఫిల్టర్ చేసే యంత్రాలను ఏర్పాటుచేసి, నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించి, సమన్వయపరచడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్నీ ఏర్పాటుచేసి, ఎక్కడా కూడా లీకేజీలు గాకుండా, అయినకూడా వెంటనే పరిష్కరించే విదంగా చర్యలు తీసుకుంటూ ప్రతి ఇంటికి శుద్ధి జలాన్ని అందించి, పేదల పక్షాన నిలిచి, మంచినీటితో వ్యాపారం చేస్తూ ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పేవిదంగా కృషిచేయవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఇప్పటికైనా ఈ సమస్య గురించి ఆలోచించి, సరైన సమయంలో పరిష్కారమార్గం సూచించకపోతే రాబోయే కాలంలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున తక్షణమే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సమాజ క్షేమాన్నీ, సంక్షేమాన్నీ ఆశించే మహోన్నత వ్యక్తులు , సమాజ శ్రేయస్సుకు పాటుపడేవారు, సామాజిక సేవా దృక్పధం గలవారు వెంటనే సంఘటితమై ఈ సమస్య పరిష్కారానికి, ప్రభుత్వానికి చేయూతనందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నవ సమాజ నిర్మాణంలో ముందుగా కనీస అవసరాల కల్పనలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువనున్న పేద ప్రజలకు అండగా నిలవడానికి ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని ఆశిద్దాం.