లాక్ డౌన్ వేళ 7వ డివిజన్ లో ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

669
7th division

కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో లాక్ డౌన్ ప్రకటించినందున  ఏ ఒక్క పేదింటి బిడ్డ కూడా ఆకలితో అలమటించకూడదనె ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ప్రతి ఒక్క  కుటుంబానికి పూర్తి స్థాయిలో ఉచిత రేషన్ బియ్యం  ప్రకటించడం జరిగింది.

ఈ క్రమంలో లాక్ డౌన్ ప్రకటించి ఒక నెల పూర్తి కావడం తో  రెండవ సారి రెండవ నెల తేదీ:2-5-2020 రోజున నుండి రామగుండం శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కోరుకంటి చందర్ అన్న గారి సహకారంతో 7వ డివిజన్ కార్పోరేటర్ వేగోలపు రమాదేవి ఆధ్వర్యంలో రెండవసారి రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పోరేటర్ వేగోలపు రమాదేవి, మున్సిపల్ ఆఫీసర్ సతీష్, మరియు R.P రమ పాల్గొన్నారు.

47 వ డివిజన్ లో నగదు పంపిణి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ కారణంగా ప్రజలకు కుటుంబ ఖర్చులకు తెల్ల రేషన్ కార్డు గల ఒక కుటుంబానికి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు 47 వ డివిజన్ లో కార్పొరేటర్ మేకల సదానందం ఆధ్వర్యంలో రేషన్ కార్డుదారులకు పదిహేను వందల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది.

47th division
47 వ డివిజన్ లో కార్పొరేటర్ మేకల సదానందం ఆధ్వర్యంలో రేషన్ కార్డుదారులకు 1500 రూపాయలు పంపిణీ

ఇందుకుగాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నగారికి రుణపడి ఉంటామని ప్రజలు సంతోషం వ్యక్తం చేసారు.