కిషన్‌ రెడ్డి కార్యాలయంలో ఆమ్రపాలి.. ఓఎస్డీగా…

299
OSD duty in kishanreddy office

ఆమ్రపాలి.. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ గా పనిచేశారు ఆమె. ఆ తర్వాత ఆమె జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యారు. అక్కడ అడిషనల్‌ కమిషనర్‌ గా కొనసాగుతున్నారు. వారిని కేంద్ర సర్వీసులోకి పంపించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డర్స్ అందాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) విధులు నిర్వహించేందుకు ఆమ్రపాలి కాటా, అడిషనల్‌ పీఎస్‌గా కె.శశికిరణాచారి వెళ్లనున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులు ఆమ్రపాలి కాటా, కె.శశికిరణాచారిలకు ఢిల్లీ బదిలీ అయ్యింది. వీరిద్దరినీ కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని కేంద్ర హోం శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలందడంతో త్వరలోనే రిలీవ్‌ చేయబోతున్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జి.కిషన్‌ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఆమ్రపాలి, అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా కె.శశికిరణాచారి విధుల్లో చేరనున్నారు.