ఈ కవలలకు తండ్రులు మాత్రం వేరు

298
china twins have 2 fathers

చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవల కవలలకు జన్మనిచ్చింది. ఇందులో కొత్త ఏమి ఉందనేగా మీ అనుమానం. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అందేంటంటే… ఆ కవలల తండ్రి ఒక్కరే కాదు. ఇద్దరు కవలలకు ఇద్దరు తండ్రులు అన్నమాట. ఈ మేరకు డిఎన్ఎ టెస్టులో తేలింది.

గ్సియామెన్ సిటీలో నివాసముండే ఓ మహిళ ఇలా వేర్వేరు తండ్రుల కవలలకు జన్మనిచ్చింది. కవలలు జన్మించిన ఆనందంలో ఉన్న వ్యక్తికి పుట్టిన బిడ్డలిద్దరి రూపురేఖలు వేర్వేరుగా ఉండడంతో అనుమానం వచ్చింది. ఒకరు అచ్చం తనలాగే ఉంటే, మరొకరు తన కుటుంబంలో ఎవరీ పోలికలు లేకుండా ఉండడం అతణ్ణి అనుమానాన్ని మరింత బలపరిచింది.

దాంతో డిఎన్ఎ టెస్టు చేయాల్సిందిగా ఆస్పత్రి వర్గాలను కోరాడు. ఈ టెస్టులో ఆ కలలకు ఇద్దరు తండ్రులు అని తేలింది. అనంతరం భార్యను నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఒక రోజు రాత్రి ఓ పరాయి వ్యక్తితో గడిపినట్లు ఒప్పుకుంది. పితృత్వ పరీక్ష చేసిన ఫుజియన్ ఝెంగటి ఫొరెన్సిక్ కేంద్రం డైరెక్టర్ ఝాంగ్ కవలలు వేర్వేరు తండ్రులతో పుట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని పేర్కొన్నాడు.

జీవశాస్త్రపరంగా ఇది చాలా అరుదైన విషయమని చెప్పిన ఆయన.. అలా జరగడానికి అవకాశం ఉందని చెప్పారు. దీనిని వైద్య పరిభాషలో హెటెరోప్తెరనల్ సూపర్ఫెకండేషన్ అంటారట. ఒకే పునరుత్పత్తి చక్రంలో ఓ మహిళ రెండు అండాలను విడుదల చేసినప్పుడు… చాలా తక్కువ కాల వ్యవధిలో ఇద్దరు వేర్వేరు భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటే ఇలా జరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.