టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ సమంత, చైతన్యని జంటగా చూస్తే చూడముచ్చటగా అనిపిస్తుంది. వీరికి సంబంధించిన విషయాలపై అభిమానులు చాలా ఆసక్తి చూపుతుంటారు. పెళ్లి తర్వాత వీరిద్దరు తొలిసారి మజిలి అనే చిత్రం చేశారు. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు దర్శకుడు తన ట్విట్టర్ ద్వారా నెటిజన్స్‌కి తెలియజేస్తున్నాడు. తాజా ట్వీట్‌లో ఈ చిత్రంలోని సమంత నటనకు ఫిదా అయిపోయాను. మజిలి సినిమాతో శ్రావణిగా వస్తున్న సమంత మీ అందరిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఆమె అసమాన నటనని చూసి మీరు షాక్ కావడం ఖాయం అని తెలిపారు శివ నిర్వాణ . ఈ ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన చైతూ ‘అవును నిజం’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి సమంత ‘థ్యాంక్యూ హజ్బండ్’ అని రిప్లై ఇచ్చింది. అక్కినేని అభిమానులు వీరి ట్వీట్లను రీ ట్వీట్లు చేయడంతో.. మజిలీ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది.