చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు రైల్వే స్టేషన్‌లో రైలింజన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పడం గమనార్హం.