పెళ్లై నాలుగేళ్లయినా..

299
four years

మీ ఎత్తు, వయసుకు అరవై కిలోల వరకు ఉండవచ్చు. అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై కిలోలు తగ్గితే మంచిది. ఇలా తగ్గడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టవచ్చు. కనీసం పది పన్నెండు కిలోలు తగ్గినా గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం దెబ్బతినకుండా బరువు తగ్గాలంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే అన్నం, రొట్టెలు, ఇడ్లీ, దోశ, ఉప్మా వంటివి తగ్గించాలి. మాంసకృత్తులు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. అప్పుడు మీ జీవక్రియ వేగం కూడా పెరుగుతుంది. రోజూ ఐదు నుంచి ఆరుసార్లు, తక్కువ మోతాదుల్లో ఆహారం తీసుకోవడం వల్ల ఆకలినీ నియంత్రించవచ్చు.

 

 




ఉదయం అల్పాహారంగా పాలు, గుడ్డు, పళ్లు, బాదం, వాల్‌నట్స్‌ వంటి గింజలు (చాలా తక్కువ మోతాదులో) తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో రెండుకు మించకుండా చపాతీలు (నూనె, లేదా నెయ్యి వెయ్యకుండా కాల్చినవి), లేదా గుప్పెడు అన్నంతో ఎక్కువ కూర, పప్పు, పెరుగు తీసుకోవాలి. ఆకుకూరలు వారానికి కనీసం మూడు రోజులు తీసుకోవడం మంచిది. ఉదయం అల్పాహారానికి, భోజనానికి మధ్య పచ్చి కూరలతో చేసిన సలాడ్‌, మొలకెత్తిన గింజల్లాంటివి తీసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్‌గా ఒక పండు తినవచ్చు. స్వీట్స్‌ పూర్తిగా మానెయ్యాలి. టీ, కాఫీలు తాగకపోవడం మేలు. ఒకవేళ తాగినా రోజుకు ఒక్కసారే.. అదీ పంచదార లేకుండా. ఉదయం, సాయంత్రం అరగంట పాటు బ్రిస్క్‌వాక్‌ (వేగంగా నడవడం) చెయ్యాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తప్పనిసరి. ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర పోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గుతారు.