మాస్ మహరాజా రవితేజ బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నప్పటికి, ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఇటీవలి కాలంలో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం మాత్రమే భారీ విజయం సాధించింది. ఇప్పుడు మరో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు రవితేజ. తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉండగానే మరో సినిమాని రవితేజ లైన్‌లో పెట్టినట్టు తెలుస్తుంది. మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ కొన్నాళ్లుగా బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు. అది కుదరకపోవడంతో రవితేజని కలిసి స్క్రిప్ట్ వివరించాడట. కథ నచ్చడంతో మాస్ రాజా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘కృష్ణ’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇంతకాలానికి మరో చిత్రం సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.