శ్రీనగర్ కాలనీ సాయి అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో నిన్న సాయంత్రమే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ప్రముఖ బుల్లితెర నటి, ‘పవిత్రబంధం’ ఫేం ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ‘స్టార్ మా’ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘ప్రవిత్ర బంధం’ సీరియల్‌లో ఝాన్సీ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది.
కాగా, ఝాన్సీ మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కొంతకాలంగా ఒక అబ్బాయితో ఝాన్సీ ప్రేమలో ఉన్నారని, ఇటీవల ప్రియుడితో ఆమెకు తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారని ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. అయితే, ఝాన్సీ ప్రేమిస్తున్న వ్యక్తి బుల్లితెర రంగానికి సంబంధించిన వ్యక్తా..? లేక వేరే వ్యక్తా..? అనేది సస్పెన్స్‌గా మారింది.