కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిన్న ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నిన్న నిర్వహించిన ఎస్ఎస్సీ సప్లిమెంటరీ హిందీ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు జరిగింది. ఈ పరీక్షకు మొత్తం ఏడుగురు విద్యార్థులు హాజారుకావాల్సి ఉండగా… జమ్మికుంట విద్యోదయ పాఠశాలకు చెందిన కోండ్ర ప్రణయ్ అనే ఒక్క విద్యార్థి మాత్రమే హాజరయ్యాడు.
ఈ ఒక్కడి కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, క్లర్క్, అటెండర్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి, ఇద్దరు కానిస్టేబుళ్లు తమ విధులను నిర్వహించారు. వీరికి తోడు తనఖీల కోసం కరీంనగర్ నుంచి రెండు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు వచ్చాయి. ఒక్కో బృందంలో ఇద్దరిద్దరు చొప్పున అధికారులు ఉన్నారు. వీరికి పోలీసు బందోబస్తు అదనం.