కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఇందుకు శ్రీరెడ్డి ఊతమివ్వటంతో చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ ఫీల్డుకు సంబంధించిన అమ్మాయిలు మాట్లాడారు. ‘సినిమా ఫీల్డులోని అమ్మాయిలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పిన జీవితా రాజశేఖర్ కూడా అలాంటిదే.
అమ్మాయిలను ఆమే స్వయంగా రాజశేఖర్ పక్కలోకి పంపిస్తుంది. మేం సినిమాల్లో బిచ్చపుదాని పాత్ర ఇచ్చినా చేద్దామని వస్తాం. కానీ వాళ్ళు ఆ క్యారెక్టర్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నారు. అమ్మానాన్నలను ఎదురించి వచ్చి మేమిక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో.. దానికి భిన్నంగా వీళ్ళు మాకు పెడుతున్న లైంగిక ఇబ్బందులు మమ్మల్ని మానసికంగా చంపేస్తున్నాయి ’ అని కంటనీరు పెట్టుకుంది బాధిత మహిళ.
తెర మీద చూపించేవి నీతులు.. తెర వెనుక పాటించే నీఛాలకు ప్రక్షాళన జరగాలని వారంతా కోరుతున్నారు. పవన్ కల్యణ్ మా ఎదురుగా వచ్చి స్పందించాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చి మా బాధలను అర్థం చేసుకుని మాకు సరైన మార్గం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి, సంధ్య, కొండవీటి సత్యవతిలు, అపూర్వలు పాల్గొన్నారు.
నటి, దర్శకురాలు జీవితపై సంచలన ఆరోపణలు చేశారు సామాజిక కార్యకర్త, పీవోడబ్ల్యూ సంధ్య. భర్త రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను సప్లై చేసేదని, హాస్టళ్లలోని అమ్మాయిలను ట్రాప్ చేసి భర్త లైంగిక కోరికలను తీర్చడానికి పంపేదని సంధ్య ఆరోపించారు. ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య ఈ ఆరోపణలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల నియంత్రణ విషయంలో నియమితం అయిన కమిటీలో జీవితకు స్థానం కల్పించడంపై సంధ్య మండిపడ్డారు. అలాంటి కమిటీలో జీవితను సభ్యురాలిగా ఉంచడం ఏమిటి? అ ని ఆమె ప్రశ్నించారు.
కమిటీలో జీవితను సభ్యురాలిగా నియమించినందుకే తను స్పందిస్తున్నాను అని సంధ్య పేర్కొన్నారు. రాజశేఖర్ కోసం జీవిత అమ్మాయిలను ట్రాప్ చేసి పంపేదని, అలాంటి ఉదంతాలు గతంలోనే తమ వద్దకు చాలా వచ్చాయని సంధ్య ప్రకటించారు. అమీర్ పేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ లోని అమ్మాయిలను జీవిత ట్రాప్ చేసేదని, భర్త లైంగిక కోరికలను తీర్చడానికి అమ్మాయిలను పంపేదని అన్నారు.
‘కొంతమంది అమ్మాయిలు ఈ విషయంలో మాకు ఫిర్యాదు చేశారు. ఒక అమ్మాయి జ్వరంతో ఒక రోజు రాలేకపోతే.. జీవిత ఫోన్ చేసి ఆ అమ్మాయిని బండబూతులు తిట్టింది. నీఛమైన మాటలను వాడుతూ.. నువ్వు రాకపోతే నా మొగుడితో తట్టుకునేది ఎలా? అంటూ విరుచుకుపడింది…’ అని అన్నారు సంధ్య. భర్త కామకోరికలను తీర్చడానికి అలాంటి పనులు చేసిన జీవితను ఇప్పుడు లైంగిక వేధింపుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో ఉంచడం విడ్డూరమని సంధ్య వ్యాఖ్యానించారు.