చార్జింగ్ పెట్టి ఫోన్‌ కాల్స్.. మొబైల్ పేలి యువతి మృతి

498
girl dies after mobile phone explodes during charging

మొబైల్ ఫోన్‌కు చార్జింగ్ పెట్టిన సమయంలో కాల్స్ మాట్లాడితే ప్రమాదమని తెలిసినా చాలామంది అలానే మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. చార్జింగ్ పెట్టి కాల్స్ మాట్లాడటం వల్ల ఫోన్లు పేలిపోతున్న ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.



 

చార్జింగ్ పెట్టి ఫోన్లో ఒకరితో మాట్లాుడుతుండగా ఒక్కసారిగా బ్యాటరీ పేలి యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని జర్సుగుడ జిల్లా లైకెరా పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. ఫోన్ పేలిపోవడంతో యువతి ఛాతి, ఎడమ చేయి, కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో యువతి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్‌ (19)గా పోలీసు వర్గాలు తెలిపాయి.


ఫోన్‌కు చార్జింగ్ పెట్టి బంధువులతో మాట్లాడుతుండగా ఆమె చేతిలోని ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయిందని మృతురాలి సోదరుడు దుర్గా ఓరమ్ ‌పేర్కొన్నాడు. ఉమా స్పృహ తప్పిపడిపోవడంతో వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్స్ చేసి ఆస్పత్రికి తరలించినట్టు దుర్గా చెప్పాడు. అయితే అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. మృతురాలు వాడిన ఫోన్.. చైనాలో తయారైన నోకియా 5233 మోడల్‌‌గా విశ్వసనీయ వర్గాల సమాచారం.