ఖని లో ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జన్మదిన వేడుకలు

537
Ravula Rajendar

భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేడుకలకు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మాజీ కార్పొరేటర్, ఫ్లోర్ లీడర్ శ్రీ రావుల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.

డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మొదట కాంగ్రెస్ పార్టీ లో కేంద్ర మంత్రిగా పని చేశారు. తర్వాత పాకిస్తాన్ విభజన సమయంలో నెహ్రూ గారు చేసినటువంటి తప్పిదాలను ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో ఈ దేశంలో ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం ఒకే జాతీయ పతాకం ఉండాలనే సంకల్పంతో పనిచేయడం జరిగిందని వివరించారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ వీ. రామచందర్, కార్పోరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్, అడ్డగుంటపల్లి అధ్యక్షులు పి రవీందర్, ఎడిటింగ్ అండ్ కాలనీ అధ్యక్షులు డి. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ అధ్యక్షులు డేవిడ్, ఎన్టిపిసి అధ్యక్షులు సతీష్, సీనియర్ నాయకుడు ధర్మపురి నరసయ్య, నర్సింగ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.