తీన్మార్ న్యూస్, హాలియా (నాగార్జునసాగర్) మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలోని వృద్ధులకు, వికలాంగులకు ఒంటరి మహిళలకు సిఎం కెసిఆర్ ఆసరాగా వున్నారని, ఆసరా పథకం ద్వారా రెండు వేల రూపాయల పింఛన్ అందిస్తూ వారు గౌరవంగా జీవించేలా పాటు పడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఆదివారం హాలియా పట్టణంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హాలియా పట్టణంలోని 5 వ వార్డుల్లో గడపగడపకు నిర్వహించిన ప్రచారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆసరా లబ్ధిదారులతో మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు అందుతున్నాయని వాకబు చేసారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ… టిఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు రెండు వేల రూపాయల పెన్షన్ అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని అన్నారు.
తమ కష్టాలను తీరుస్తు తమ కుటుంబంలో పెద్ద కొడుకులాగా… ఆదరిస్తున్న సిఎం కెసిఆర్ రుణం తీర్చుకుంటామని , ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామనీ లబ్దిదారులు ముక్తకఠంతో చెబుతున్నారని పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసీ గెలిపించేందుకు లబ్ధిదారులు సిద్దంగా ఉన్నారన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం లో హాలియా మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, రామగుండం కార్పొరేటర్లు పెంట రాజేష్ గారు, అడ్డాల గట్టయ్య, అధిక సంఖ్యలో టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.