వివాహానికి ముందు బట్టతల విషయం దాచిన భర్తకు విడాకులిచ్చేందుకు భార్య సిద్దమైంది. ఈ ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో వెలుగుచూసింది.
పెండ్లికి ముందు తన భర్తకు తల నిండుగా జుట్టు ఉండేదని తెలిపింది. ఏడాది తర్వాత ఆయనది సహజమైన జుట్టు కాదని, విగ్ ధరిస్తారని తెలిసిందని ఆమె వాపోయింది.
తనకు బట్టతల ఉందని భర్త ఎన్నడూ చెప్పలేదని పేర్కొంది. బట్టతల విషయం చెప్పనందున భర్త నుంచి విడాకులు కోరుతున్నానని ఆమె చెప్పారు.
మీరట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన కౌన్సెలింగ్ కు హాజరైన మహిళ తన గోడు వెళ్లబోసుకున్నారు.
గత ఏడాది జనవరిలో ఘజియాబాద్‌లో తనకు వివాహం జరిగిందని తెలిపింది. పెండ్లయిన తర్వాతే ఆయనకు బట్టతల ఉన్నట్టు తెలిసిందని చెప్పింది.
తన స్నేహితుల ముందు ఈ విషయం తనకు అవమానకరంగా ఉందని పేర్కొంది. పోలీసులు ఎంతగా సర్ధిచెప్పినా ఆమె విడాకులు కావాలని తేల్చిచెప్పింది.