క‌రోనా వ్యా‌క్సి‌న్ వేయించుకున్న కిష‌న్ రెడ్డి‌

258
Kishan Reddy vaccinated against corona

దేశవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి జీ.కిష‌న్ రెడ్డి నేడు కోవిడ్ టీకా తీసుకున్నారు. హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఆయ‌న కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు.

దీర్ఘ‌కాల వ్యాధులు ఉన్న 45 ఏళ్లు దాటిన వారికి కూడా కోవిడ్ టీకా ఇస్తున్నారు. కోవిన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న వారికి ప్ర‌భుత్వ ఆస్పత్రిల్లో టీకాలు ఇస్తున్నారు.

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి టీకా తీసుకునే స‌మ‌యంలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద‌ర్ కూడా అక్క‌డే ఉన్నారు. హైద‌రాబాద్‌లోని భార‌త్‌బ‌యోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను ఆయ‌న వేయించుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు నిన్న వేయించుకున్న సంగతి తెలిసిందే.