కేశఖండనంకు మేక బలి.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు

343
Goat sacrifice for haircut SI Suspend

ఆధునిక యుగంలో కూడా మూఢనమ్మకాలను నమ్ముతూ కొన్ని ప్రాంతాల్లో జంతుబలులు కొనసాగుతున్నాయి.

రాజస్థాన్ లో ఓ పోలీసు అధికారి మేకను బలివ్వడంతో అతనిపై సస్పెన్షన్ వేటు పడింది.

రాష్ట్రంలోని కోట జిల్లా డియోలీ-మాంఝీ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న భన్వర్ సింగ్ ఇటీవల తన మనవడి కేశఖండన వేడుక నిర్వహించాడు.

గ్రామలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలో భన్వర్ సింగ్ మేకను కూడా బలిచ్చాడు.

మనవడి కేశఖండన సందర్భంగా తన బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశాడు.

ఎస్సై మేకను బలి ఇచ్చిన విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో కోట జిల్లా గ్రామీణ ఎస్పీ శరద్ చౌదరి విచారణకు ఆదేశించారు.

ఎస్సై భన్వర్ సింగ్ మేకను బలిచ్చిన విషయం నిర్ధారణ కావడంతో అతడిని వెంటనే సస్పెండ్ చేశారు.