భర్తపై ఉన్న కోపాన్ని తన ఇద్దరు పిల్లలపై చూపింది ఓ తల్లి. అట్లకాడను వేడిచేసి వాతలు పెట్టడంతో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యా యి.
ఈ ఘటన హైద్రాబాద్ బోరబండ ప్రాంతంలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితేసనత్‌నగర్ పీఎస్ పరిధిలోని బోరబండ వి.రామారావునగర్‌లో రాజు, పావని దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి కుమారుడు జ్ఞానేశ్వర్ (5), కూతురు మహాలక్ష్మి (4) సంతానం.ఈ నెల 23న ఈ దంపతులు చిన్న విషయమై గొడవపడ్డారు.
అయితే.. భర్తపై ఉన్న కోపాన్ని పావని తమ ఇద్దరు పిల్లలపై చూపింది. వారిద్దరిని తీవ్రంగా కొట్టడమే కాకుండా అట్లకాడను వేడిచేసి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది.
బాధలు భరించలేక పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చారు.
జరిగిన ఘటనను స్థానిక అంగన్‌వాడీ టీచర్ జిల్లా సంక్షేమ అధికారి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ మేరకు లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారిని సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే దర్యాప్తు చేపట్టి పావనిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.