దేశంలో కొత్త‌గా 13 వేల కోవిడ్ కేసులు

235
75% cases Maharashtra and Kerala!

గత కొద్ది నెలలుగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోన వైరస్ కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.

వాటి గణాంకాల ప్రకార, దేశంలో గత 24 గంటల్లో 13,193 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. అదే స‌మ‌యంలో 10,896 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

ఇక దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,63,394 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 97 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

దీంతో మృతుల సంఖ్య 1,56,111కు పెరిగింది. ఇప్పటివరకు 1,06,67,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

1,39,542 మంది ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కు 1,01,88,007 మందికి వ్యాక్సిన్ వేశారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,94,74,862 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది.