ఒక్క బార్ కోసం 123 మంది దరఖాస్తు

263
123 Applications for a single bar

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా కొత్త బార్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని లక్షేటిపేట పట్టణంలో ఒక్క బార్ కోసం 123 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఒక్కొక్కరు రూ, లక్ష డిడి ని ప్రభుత్వానికి ఇచ్చారు. మొత్తం 1 కోటి రూ 23 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు.

ఇందులో ఒక్కరిని లాటరీ లో ద్వారా ఎంపిక చేస్తారు.దీన్ని బట్టిచూస్తే స్థానిక వ్యాపారులు బార్ దక్కించుకునేందుకు పోటాపోటీగా ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.

కొత్తబార్లకోసం జనవరి 25 నుంచి సోమవారం వరకు ఎక్సైజ్ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.

శనివారం వరకు మొత్తం 2050 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు రూపంలోనే ప్రభుత్వ ఖజానాకు రూ. 70కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తున్నది.

రాష్ట్రంలో అత్యల్పంగా నిజామాబాద్‌ జిల్లాలో దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది.
నిజామాబాద్‌ మున్సిపాలిటీలో ఏడు బార్లకు ఏడు దరఖాస్తులు రాగా, బోధన్‌లో మూడు బార్లకు మూడు దరఖాస్తులే వచ్చినట్టు తెలిసింది.