
సినెటేరియా డాట్ కామ్, మీడియా సౌత్ సంయుక్తాధ్వర్యంలో జూన్ 11వ తేదీ నుంచి 10 రోజుల పాటు అడ్వైర్టెజింగ్ చిత్రాల నిర్మాణంలో వర్క్ షాపు నిర్వహించనున్నామని మీడియా సౌత్ సీఈఓ వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వైర్టెజింగ్ చిత్రాలు లేదా ప్రకటనల చిత్రాల రూపకల్పనకు సంబంధించిన సంపూర్ణ శిక్షణ ఈ వర్క్ షాపులో ఇవ్వనున్నామని ఆయన వెల్లడించారు. ఫిలిం మేకింగ్ శిక్షణలో పాల్గొనాలకునే ఆసక్తిగల అభ్యర్థులకు అర్హత పరీక్ష జూన్ 5న హాజరు కావాలని, అర్హత పరీక్షకు హాజరయ్యే వారు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. వివరాలకు 7337556141 లో సంప్రదించాలని వెంకట్ సూచించారు.