
తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై జరిగిన దాడి ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ విజయవాడలోని గురునానక్ నగర్‌లో ఉన్న పట్టాభి ఇంటికి చేరుకుని పరామర్శించారు. అననతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు బరి తెగించి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
పట్టాభిపై దాడికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవినీతిని పట్టాభి ప్రశ్నించినందుకే ఆయనపై దాడులకు పాల్పడ్డారని అన్నారు. ఈ కాలనీలో ప్రతి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ దాడి ఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని తెలిపారు. సీసీ పూటేజీతో దుండగులను పట్టుకోవచ్చని అన్నారు. ఇది పులివెందుల కాదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.