రాజాకీయాల్లోకి సినీ నటి రాధిక!

445
Actor Radhika

సినీ నటి రాధిక రాజకీయాల్లోకి రానున్నారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ చెప్పారు. రాధిక భర్త శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. శరత్‌కుమార్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాధిక పోటీ చేయనున్నారని ప్రకటించారు.

అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు ఆశిస్తున్నామని ప్రత్యేక చిహ్నంపై పోటీ చేస్తామన్నారు. ఏప్రిల్, మే నెలలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని అధికార అన్నాడీఎంకే, బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల ప్రచారం కోసం ఆయా పార్టీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.