నా రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలతో చర్చించా.. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరుతానో చెబుతా!: కొణతాల రామకృష్ణ

509
political future

తాను రాజకీయాల్లోకి తిరిగిరావడంపై కొనసాగుతున్న సస్పెన్స్ కు ఏపీ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెరదించారు. తన రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలు, మద్దతుదారులతో ఇప్పటికే చర్చించానని రామకృష్ణ తెలిపారు. ఇంకో వారం రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. మరికొంత మంది మద్దతుదారులతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
 
విజయనగరం జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను గుట్టుగా వెళ్లి ఏ పార్టీ కండువాను కప్పుకోననీ, బహిరంగంగానే తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.