మైనర్ ను కిడ్నాప్ చేసిన మరో మైనర్

200
kidnapped a minor

11 ఏళ్ల బాలుడిని ఓ మైనర్ బాలిక కిడ్నాప్ చేసిన ఘటన థానే జిల్లాలో వెలుగుచూసింది. శాంతి నగర్ పీఎస్ పరిధిలో మహిళ టైలర్ పనిచేస్తుంది. సదరు మహిళ తన 11 ఏళ్ల కుమారుడిని ట్యూషన్ కోసం పంపించింది. అయితే సాయంత్రం సమయంలో ఆ మహిళకు ఫోన్‌కాల్ వచ్చింది. మాకు రూ.6లక్షలు ఇవాలి..లేదంటే మీ కుమారుడు ఇంటికి రాడని గుర్తు తెలియని వ్యక్తి మహిళను బెదిరించారు. డబ్బులు ఇవ్వకుండా..ఈ విషయం పోలీసులకు చెప్పేందుకు ప్రయత్నిస్తే ఆ బాలుడిని చంపేస్తామని హెచ్చరించారు. డబ్బులు బ్యాగులో పెట్టి..దాన్ని భివాండి పట్టణంలోని శివాజీ చౌక్ దగ్గర కనబడే బైకుపై పెట్టాలని మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో చెప్పాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

 




దుండగులు చెప్పినట్టుగానే చేయాలని పోలీసులు ఆ మహిళకు సూచన చేశారు. పోలీసులు చెప్పినట్టుగానే ఆ మహిళ ఓ బ్యాగును శివాజీ చౌక్ దగ్గరున్న బైకుపై పెట్టింది. ఇంతలోనే అటువైపు నుంచి 17 ఏళ్ల బాలిక అక్కడికి వచ్చి బ్యాగును తీసుకెళ్తుండగా..పోలీసులు ఆమెను పట్టుకున్నారు. నిందితురాలు కిడ్నాపైన బాలుడి తల్లి దగ్గర బట్టలు కుట్టేందుకు వచ్చేందని ఎస్‌ఐ మమతా డిసౌజా తెలిపారు. నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 364-కింద నమోదుచేసుకుని, జువైనైల్ హోంకు తరలించామని వెల్లడించారు.